Jr NTR: కరోనాపై పోరుకు రూ.50 లక్షలు, సినీ కార్మికుల కోసం రూ.25 లక్షలు విరాళం ప్రకటించిన ఎన్టీఆర్

Jr NTR donates a huge some towards anti corona activities
  • కరోనాపై పోరుకు ఎన్టీఆర్ భారీ విరాళం
  • తెలుగు రాష్ట్రాలకు రూ.25 లక్షల చొప్పున డొనేషన్
  • ఆయా రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇస్తున్నట్టు ట్వీట్
టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ కరోనాపై పోరుకు భారీ విరాళం ప్రకటించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు రూ.25 లక్షల చొప్పున విరాళం అందించాలని ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆయా రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు తాను విరాళం ఇస్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండా, లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న తెలుగు సినీ కార్మికుల కోసం పాతిక లక్షల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్టు ట్విట్టర్ లో వెల్లడించారు. ఇప్పటికే ప్రభాస్, మహేశ్ బాబు తదితరులు కరోనాపై పోరాడుతున్న తెలుగు రాష్ట్రాలకు విరాళాలు అందించిన సంగతి తెలిసిందే.
Jr NTR
Corona Virus
Andhra Pradesh
Telangana
Tollywood
Donations
Lockdown
COVID-19

More Telugu News