Ian Obrian: నాతో మాట్లాడండి... కొంత డబ్బు వేయండి... లండన్ లో వున్న కుటుంబాన్ని కలవాలి: కివీస్ క్రికెటర్ ఆవేదన

Kevis Cricketer has no Money to go to home

  • వీడియో కాల్ ద్వారా 20 నిమిషాలు మాట్లాడండి
  • ఏ అంశంపైనైనా మాట్లాడతాను
  • నచ్చితే కొంత డబ్బు పంపాలని కోరిన ఇయాన్ ఓబ్రైన్

యూకేలో ఉన్న తన కుటుంబాన్ని కలిసేందుకు వెళ్లాలంటే, తన వద్ద విమానం టికెట్లకు డబ్బు లేదని వాపోయిన న్యూజిలాండ్ పేస్ బౌలర్ ఇయాన్ ఓబ్రైన్, డబ్బు కోసం వినూత్న ఆలోచన చేశాడు. స్కైప్ / వీడియో కాల్ ద్వారా తనతో 20 నిమిషాలు మాట్లాడవచ్చని, తన మాటలు నచ్చితే, కొన్ని డాలర్లు లేదా పౌండ్లు పంపాలని ఆయన విన్నవించాడు. న్యూజిలాండ్ తరఫున 22 టెస్ట్ లు, 10 వన్డేలు, 4 టీ-20 మ్యాచ్ లు ఆడిన ఇయాన్, తనతో క్రికెట్ నుంచి రాజకీయాల వరకూ, వంటల నుంచి మానసిక ఒత్తిడి వరకూ, సచిన్‌ టెండూల్కర్‌ గురించి... ఏదైనా మాట్లాడవచ్చని తెలిపాడు.

కాగా, ఇయాన్ స్వదేశం న్యూజిలాండే అయినా, అతని భార్య, ఇద్దరు పిల్లలతో ఇంగ్లండ్‌ లో స్థిరపడ్డాడు. తల్లిదండ్రులను కలిసేందుకు న్యూజిలాండ్ వచ్చి, అక్కడే ఇరుక్కుపోయాడు. తిరిగి వెళ్లేందుకు మూడు విమానాల్లో టికెట్లు బుక్ చేసుకున్నా, అవన్నీ చివరి నిమిషంలో రద్దు అయ్యాయి. ఆ డబ్బులు ఇంకా వెనక్కు రాలేదు. ఇప్పుడు కాస్తంత ఎక్కువ డబ్బు ఇచ్చయినా, ఇంగ్లండ్ వెళ్లిపోవాలని భావిస్తున్నాడు.

ఇదిలావుండగా, 2009లో హామిల్టన్‌ లో జరిగిన టెస్టు మ్యాచ్ లో ఇయాన్, తన బౌలింగ్ లో సచిన్‌ ను అవుట్‌ చేశాడు. ఆ బాల్ గురించి కూడా అభిమానులకు తన మనసులోని మాటను చెప్పాలన్న ఉద్దేశంతోనే సచిన్‌ పేరు కూడా జత చేశాడు. ఇక ఇయాన్ భార్య ఇప్పటికే ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతుండగా, కరోనా సోకితే, ఆమె ప్రాణాలకే ప్రమాదమని ఇయాన్ వాపోయాడు.

  • Loading...

More Telugu News