Vijay Sai Reddy: అలాగైతే ఏపీలో కరోనా నియంత్రణ గతి తప్పే ప్రమాదం: విజయసాయిరెడ్డి
- పొరుగు రాష్ట్రాల్లో వున్న ఏపీ ప్రజలు ఏప్రిల్ 14 వరకు అక్కడే ఉండాలి
- కేసీఆర్ గారితో జగన్ గారు మాట్లాడారు
- అక్కడ వారికి ఏ కొరత రాకుండా చూసుకుంటామని హామీ వచ్చింది
- బయటి నుంచి పౌరులు వస్తే మంచిదికాదు
ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఏపీ ప్రజలు సొంత రాష్ట్రంలో అడుగుపెట్టడానికి వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వట్లేదన్న విషయం తెలిసిందే. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతోన్న నేపథ్యంలో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ ట్వీట్ చేశారు.
'పొరుగు రాష్ట్రాలలో వున్న ఏపీ ప్రజలు ఏప్రిల్ 14 వరకు అక్కడే ఉండాలి. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ గారితో జగన్ గారు మాట్లాడారు. అక్కడ వారికి ఏ కొరత రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చి కేసీఆర్ గారు పెద్ద మనసును చాటుకున్నారు. బయటి నుంచి పౌరులు వస్తే నియంత్రణ చర్యలు గతి తప్పే ప్రమాదం ఉంది' అని విజయసాయిరెడ్డి చెప్పారు.