Cognizant: భారతీయ ఉద్యోగులకు 25 శాతం అధిక శాలరీని ఇవ్వనున్న ఐటీ దిగ్గజం

Cognizant to pay extra salary in April

  • కరోనా నేపథ్యంలో ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన కాగ్నిజెంట్
  • వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ సంస్థకు సేవలందిస్తున్నారని కితాబు
  • 1.30 లక్షల మందికి అధిక శాలరీ ఇస్తామని ప్రకటన

కరోనా వైరస్ నేపథ్యంలో భారత్ లాక్ డౌన్ అయింది. దాదాపు ఉద్యోగులందరూ వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ లో పని చేస్తున్న తమ ఉద్యోగులకు ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ శుభవార్తను వినిపించింది. నెలవారీ శాలరీకి అదనంగా బేసిక్ లో 25 శాతాన్ని అధికంగా చెల్లిస్తామని ప్రకటించింది. ఏప్రిల్ నెల నుంచి ఇది అమలవుతుందని... రానున్న నెలల గురించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అసోసియేట్ స్థాయి, అంత కంటే కింద స్థాయిలో ఉన్న ఉద్యోగులకు ఈ ఆఫర్ ప్రకటించింది. ఇండియాలో కాగ్నిజెంట్ కు 2,03,700 మంది ఉద్యోగులు ఉండగా.... వీరిలో 1,30,000 మందికి పైగా బెనెఫిట్ పొందబోతున్నారు.

ఈ సందర్భంగా కాగ్నిజెంట్ సీఈవో బ్రియాన్ మాట్లాడుతూ, అదనపు శాలరీ గురించి ప్రతి నెల సమీక్షిస్తామని చెప్పారు. కరోనాతో ప్రపంచం షాక్ కు గురైందని అన్నారు. అన్ని సంస్థల మాదిరే కాగ్నిజెంట్ కూడా కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైందని చెప్పారు. కష్టకాలంలో కూడా అంతా సవ్యంగా జరగాలని వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చామని... తమ ఉద్యోగుల ఆరోగ్యం, సేఫ్టీకి ప్రాధాన్యతను ఇచ్చామని... ఇదే సమయంలో క్లయింట్లకు సేవలు అందించడం, వారి డేటాను జాగ్రత్తగా రక్షించడం కూడా తమకు ప్రధానమని అన్నారు. మీరు, మీ కుటుంబాలు ఇబ్బంది పడుతున్న ఈ క్లిష్ట సమయంలో కూడా సంస్థ కోసం మీరు పని చేస్తున్నారని ఉద్యోగులకు బ్రియాన్ కితాబునిచ్చారు.

  • Loading...

More Telugu News