Boris Johnson: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు కరోనా పాజిటివ్
- జ్వరం, దగ్గుతో బాధపడుతున్న బోరిస్ జాన్సన్
- చీఫ్ మెడికల్ ఆఫీసర్ సూచనతో కరోనా టెస్టు చేయించుకున్న వైనం
- కరోనా అని తేలడంతో ఇంటి నుంచే పనిచేయాలని నిర్ణయం
కరోనా మహమ్మారి ఎవరినీ వదలడంలేదు. తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జోన్సన్ కు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. గత 24 గంటలుగా బోరిస్ జాన్సన్ స్వల్పంగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్నట్టు గుర్తించారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ సూచనల మేరకు ఆయన కరోనా టెస్టు చేయించుకోగా, పరీక్ష ఫలితాల్లో పాజిటివ్ అని వచ్చింది.
దాంతో 55 ఏళ్ల బోరిస్ జాన్సన్ ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నారు. కరోనా నేపథ్యంలో ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ, తాను కూడా కరోనా బారినపడ్డానని, అయితే, టెక్నాలజీ అండతో ఇంటినుంచే వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపిస్తానని తెలిపారు.