Narendra Modi: రికార్డులు తిరగరాసిన మోదీ లాక్ డౌన్ ప్రసంగం

Modi lock down speech rewrites all viewership records
  • 201 చానళ్లలో మోదీ లాక్ డౌన్ స్పీచ్ ప్రసారం
  • 19.7 కోట్ల వీక్షణలతో తిరుగులేని రికార్డు
  • గతంలో 13.3 కోట్ల వీక్షణలతో ఐపీఎల్ ఫైనల్ రికార్డు
కరోనా వ్యాప్తిని అరికట్టే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటిస్తూ జాతినుద్దేశించి ప్రసంగించగా, ఇప్పుడా ప్రసంగం బుల్లితెర రికార్డులు బద్దలు కొట్టింది. టీవీ రేటింగ్స్ పరంగా ఇప్పటివరకు ఉన్న రికార్డులను మోదీ లాక్ డౌన్ ప్రసంగం తిరగరాసింది. ఇప్పటివరకు అత్యధిక వ్యూయర్ షిప్ నమోదు చేసిన టీవీ స్పీచ్ గా చరిత్ర సృష్టించింది. ఈ ప్రసంగం 201 టీవీ చానళ్లలో ప్రసారం కాగా, 19.7 కోట్ల మంది వీక్షించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. గతంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ 13.3 కోట్ల వీక్షణలతో అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు మోదీ ప్రసంగం దాన్ని వెనక్కునెట్టింది. ఈ మేరకు టీవీ రేటింగ్ ఏజెన్సీ 'బార్క్' వెల్లడించింది.
Narendra Modi
Lockdown
Speech
Record
India
Corona Virus

More Telugu News