Corona Virus: ప్రపంచ వ్యాప్తంగా మరింత పెరిగిన కరోనా మరణాలు
- ఇప్పటివరకు 27,250 మంది మృతి
- 5.94 లక్షల మందికి కరోనా
- ఇప్పటివరకు కోలుకున్న వారు 1.33 లక్షలు
- ఇటలీలో కరోనా మృతుల సంఖ్య 9,134, స్పెయిన్‌లో 5,138
ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటివరకు 27,250 మంది కరోనా వల్ల మృతి చెందారు. 5.94 లక్షల మందికి కరోనా సోకింది. ఇప్పటివరకు1.33 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇటలీలో కరోనా మృతుల సంఖ్య 9,134, స్పెయిన్‌లో 5,138 కాగా, అమెరికాలో ఇప్పటి వరకు 1,477 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇక జర్మనీలో 50,871 మందికి కరోనా సోకగా, 351 మంది మృతి చెందారు. ఫ్రాన్స్‌లో 32,964 మందికి కరోనా సోకింది. వారిలో 1,995 మంది మృతి చెందారు. ఇరాన్‌లో 32,332 కరోనా కేసులు నమోదుకాగా మృతుల సంఖ్య 2,378గా ఉంది. యూకేలో 14,543 మంది కరోనా బాధితులు ఉన్నారు. వారిలో 759 మంది మృతి చెందారు. స్విట్జర్లాండ్‌లో 12,928 మందికి కరోనా సోకగా, 231 మంది ప్రాణాలు కోల్పోయారు.