Kurnool District: తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన భర్త.. పరీక్షలు చేయించుకుంటేనే కాపురమన్న భార్య

Wife did not allow husband as he came from Telangana

  • మిర్యాలగూడలో డ్రైవర్‌గా పనిచేస్తున్న భర్త
  • రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చిన భర్తను అడ్డుకున్న భార్య
  • పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

తెలంగాణలోని మిర్యాలగూడలో డ్రైవర్‌గా పనిచేస్తూ రెండు రోజుల క్రితం కర్నూలు జిల్లాలోని తన స్వగ్రామానికి వచ్చిన భర్తను దూరం పెట్టిందో భార్య. కరోనా పరీక్షలు చేయించుకున్న తర్వాతే ఇంట్లో అడుగుపెట్టాలని సూచించింది. అయినప్పటికీ అతడు వినకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని ఓ గ్రామంలో జరిగిందీ ఘటన.
తెలంగాణ ప్రాంతంలో కరోనా వైరస్ కేసులు నమోదవుతుండడంతో అక్కడి నుంచి వచ్చిన భర్తను ఇంట్లోకి రాకుండా అడ్డుకుందా ఇల్లాలు. వైరస్ సోకి ఉంటే అది తనకు, తన పిల్లలకు సోకుతుందని, కాబట్టి పరీక్షలు చేయించుకుని, వైరస్ సోకలేదని తేలిన తర్వాతే రావాలని కోరింది. అతడు వినకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి అది పోలీస్ స్టేషన్ మెట్లెక్కేందుకు కారణమైంది. స్పందించిన పోలీసులు భార్యాభర్తలిద్దరినీ ఆదోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారిద్దరికీ పరీక్షలు నిర్వహించిన అనంతరం క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.

  • Loading...

More Telugu News