Tirumala: తిరుమలలో ముగిసిన ధన్వంతరీ యాగం... మంత్రజలాన్ని రిజర్వాయర్ లో కలిపిన పూజారులు!

Dhanvantari Yagam Vompleted in Tirumala

  • ముగిసిన మూడు రోజుల మహాయాగం
  • ఆకాశగంగ, పాపనాశనం జలాశయాల్లో మంత్రజలం
  • రోజుకు 10 వేల మందికి ఆహారం సమకూర్చనున్న టీటీడీ

సర్వ మానవ హితాన్ని కోరుతూ, తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో మూడు రోజుల పాటు జరిగిన శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం మహా పూర్ణాహుతితో ముగిసింది. మంత్రజలాన్ని పండితులు తిరుమల, తిరుపతికి మంచి నీటిని సరఫరా చేసే ఆకాశగంగ, పాపనాశనం జలాశయాల్లో కలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తిరుపతిలో ఆహారం అందుబాటులో లేక పలువురు పేదలు ఇబ్బంది పడుతున్నారన్న సమాచారం తమకు అందిందని, టీటీడీ బోర్డు చైర్మన్‌  వైవీ సుబ్బారెడ్డి సూచనల మేరకు, ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ద్వారా ఏప్రిల్ 14 వరకూ రోజుకు 10 వేల మందికి ఆహార పొట్లాల పంపిణీని ప్రారంభించామని అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఓ సాంబార్ అన్నం ప్యాకెట్, ఓ పెరుగన్నం ప్యాకెట్ అందిస్తామని, అవసరమైతే 50 వేల ఆహార పొట్లాలు తయారుచేసి పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.

  • Loading...

More Telugu News