Heritage: కరోనా సహాయక చర్యల కోసం 'హెరిటేజ్' రూ.కోటి సాయం

heritage donation one crore for corona eradication programmes

  • ప్రకటించిన ఎండీ నారాభువనేశ్వరి 
  • రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.30 లక్షలు 
  • మరో నాలుగు రాష్ట్రాలకు రూ.10 లక్షలు చొప్పున

ప్రముఖ వ్యాపార సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ కరోనా సహాయక చర్యల కోసం దేశంలోని ఆరు రాష్ట్రాలకు మొత్తం  కోటి రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించింది. విపత్తు ఎదుర్కొంటున్న ఈ కష్టకాలంలో ఆయా ప్రభుత్వాలు అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు తమవంతు సాయంగా ఈ మొత్తాన్ని అందజేస్తున్నట్లు హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి తెలిపారు. 

ఈ నిధుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రా, తెలంగాణకు చెరో రూ.30 లక్షలు అందజేస్తామని, మిగిలిన నలభై లక్షలను కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలకు రూ.10 లక్షలు చొప్పున అందజేయనున్నట్లు భువనేశ్వరి తెలిపారు. ఈ నిధులను ఆయా రాష్ట్రాల సీఎం సహాయ నిధికి జమ చేస్తామని తెలిపారు.


  • Loading...

More Telugu News