Puri Jagannadh: ఇలాచేస్తే ప్రజల్ని ఇళ్లకే పరిమితం చేయొచ్చు : పూరీజగన్నాథ్

puri sugested drone activityto control people in lockdown period
  • డ్రోన్లతో దయ్యం బొమ్మలను ఎగరేసి భయపెట్టాలి
  • తన ప్రయోగాన్ని వీడియోలో వివరించిన దర్శకుడు
  • బొమ్మ చూసి జనం పరుగులు

కరోనా విపత్తు నేపథ్యంలో జనాన్ని ఇళ్లకే పరిమితం చేయాలంటే డ్రోన్ కెమెరాలను, వాటికి దయ్యం బొమ్మలు కట్టి వినియోగించాలని ప్రముఖ దర్శకుడు పూరీజగన్నాథ్ సూచించారు. దీనివల్ల ఎటువంటి పోలీసులు, ఆర్మీ అవసరం లేకుం డానే జనాన్ని పూర్తిగా ఇళ్లకు పరిమితం చేయవచ్చునని సూచించారు. ఇందుకు సంబంధించి తాను ప్రయోగాత్మకంగా చేసిన ప్రయత్నం వీడియోను ఒకటి ఆయన విడుదల చేశారు. 

ఈ వీడియోలో డ్రోన్ కెమెరాకు దెయ్యం బొమ్మ కట్టి ఉంది. ఈ డ్రోన్ ప్రయాణించిన ప్రాంతాల్లో దానితోపాటు ఉన్న దెయ్యం బొమ్మను చూసి జనం జడుసుకుని ఇళ్లలోకి పారిపోవడం కనిపించింది. ఇలాంటి విపత్కర పరిస్థిల్లోనూ కొందరు ఆకతాయిలు మాత్రం రోడ్లపైకి వచ్చిన చక్కర్లు కొడుతున్నారని, ఇటువంటి వారిని కట్టడి చేసి  ఇళ్ళల్లో ఉంచేందుకు ఇది  అత్యుత్తమ మార్గమని పూరీ తెలిపారు.  

Puri Jagannadh
Lockdown
people
drone activity

More Telugu News