KTR: తల్లిని పోగొట్టుకున్న ఓ ప్రిన్సిపాల్ వినతికి తక్షణమే స్పందించిన మంత్రి కేటీఆర్

Minister Ktr reacts immediately about a doctors request

  • మహారాష్ట్రలోని ఓ కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న డాక్టరు సుభాష్
  • హైదరాబాద్ లో ఆయన తల్లి అంత్యక్రియలు 
  • ఇక్కడికి వచ్చేందుకు లాక్ డౌన్ ఆంక్షలు లేకుండా చూడాలి
  • కేటీఆర్ ను రిక్వెస్ట్ చేస్తూ ఓ ట్వీట్ చేసిన సుభాష్ 

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న కారణంగా రాష్ట్ర సరిహద్దులు దాటే పరిస్థితి లేదు. ఇదే సమయంలో మహారాష్ట్రలోని ఓ కళాశాలలో ప్రిన్సిపల్ గా పని చేస్తున్న ఓ తెలంగాణ వ్యక్తికి పెద్ద కష్టమొచ్చి పడింది. ఈరోజు ఉదయం తన తల్లి చనిపోయిందని, ఆమె చివరి చూపు దక్కించుకోవాలంటే తనకు తెలంగాణలోకి వచ్చేలా అనుమతించాలని కోరుతూ మంత్రి కేటీఆర్ కు ఆయన విజ్ఞప్తి చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై స్పందించిన కేటీఆర్, సదరు ప్రిన్సిపల్ తల్లి మృతిపై విచారం వ్యక్తం చేశారు. ఆ ప్రిన్సిపల్ ని రాష్ట్రంలోకి అనుమతించే విషయమై తన కార్యాలయ సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

మహారాష్ట్రలోని చంద్రాపూర్ లో ఉన్న జనతా మహా విద్యాలయలో ప్రిన్సిపాల్ గా పని చేస్తున్న తన పేరు డాక్టరు సుభాష్ అని ఆ ట్వీట్ లో కేటీ ఆర్ కు తెలిపారు. హైదరాబాద్ లో ఈరోజు ఉదయం తన తల్లి చనిపోయారని, ఆమెను కడసారి చూసేందుకు, ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు తాను అక్కడికి రావాల్సిన తప్పనిసరి పరిస్థితి నెలకొందని చెప్పారు. లాక్ డౌన్ నేపథ్యంలో తన ప్రయాణానికి ఎవరూ ఆటంకం కల్గించకుండా ఉండేలా చూడాలని వేడుకుంటున్నానని తన ట్వీట్ లో సుభాష్ కోరారు.

  • Loading...

More Telugu News