Drones: ‘కరోనా’ నిర్మూలనకు డ్రోన్ల సాయంతో ట్రాన్స్ పోర్ట్ వెహికల్స్ శుభ్రం

  • నారాయణ పేట జిల్లాలో  డ్రోన్ల  వినియోగం
  • డ్రోన్ల ద్వారా సోడియం హైడ్రో క్లోరైడ్ ద్రావణంతో శుభ్రం
  •  సంబంధిత వీడియోను పోస్ట్ చేసిన జిల్లా కలెక్టర్
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకునే ముందస్తు చర్యల నిమిత్తం నారాయణ పేట జిల్లాలో సాంకేతికతను వినియోగిస్తున్నారు. జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే అత్యవసర సరకు రవాణా వాహనాల ద్వారా ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఆయా వాహనాలపై సోడియం హైడ్రో క్లోరైడ్ ద్రావణాన్ని చల్లేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఆయా వాహనాలను  సోడియం హైడ్రో క్లోరైడ్ ద్రావణం చల్లి శుభ్రం చేస్తుండగా తీసిన ఓ వీడియోను నారాయణ పేట కలెక్టర్ పోస్ట్ చేశారు. కృష్ణా-గూడబేలూరు సరిహద్దులో సరుకులతో వస్తున్న ఓ వాహనాన్ని ఈ పద్ధతిలో శుభ్రం చేస్తుండగా తీసిన వీడియోను ఈ పోస్ట్ లో జతపరిచారు.
Drones
Corona Virus
goods vehicles
Narayanapet District

More Telugu News