Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల వేతనాల్లో కోత!

TS government cuts salaries and pensions amidst lock down situations

  • కరోనా ప్రభావంతో లాక్ డౌన్
  • రాష్ట్ర ఆర్థిక భరోసా కోసం సర్కారు కీలక నిర్ణయం
  • ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగుల వేతనాల్లోనూ కోత

కరోనా ప్రభావంతో లాక్ డౌన్ విధించిన దృష్ట్యా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నిలకడగా ఉంచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల వేతనాల్లోనూ కోత విధించారు. ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగుల వేతనాల్లోనూ కోత తప్పలేదు.

అఖిల భారత సర్వీసు ఉద్యోగుల వేతనాల్లో 60 శాతం కోత, మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధించారు. నాలుగో తరగతి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధించారు. అంతేకాదు, రాష్ట్రంలోని విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం కోత విధించారు. నాలుగో తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లలో మాత్రం 10 శాతం కోత విధించారు.

ఇక అటు, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాల్లోనూ 75 శాతం కోత విధించారు. కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లోనూ 75 శాతం కోత తప్పలేదు.

  • Loading...

More Telugu News