Lockdown: ప్రీపెయిడ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్ చెప్పిన బీఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్
- వ్యాలిడిటీ గడువు పెంచిన సంస్థలు
- బీఎస్ఎన్ఎల్ వచ్చే నెల 20 వరకు,
- ఎయిర్‌టెల్ ఏప్రిల్ 17 వరకు పెంపు
కరోనా మహమ్మారిని నిలువరించేందుకు కేంద్రం మూడు వారాల లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో టెలికం సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. లాక్‌డౌన్ కారణంగా రీచార్జ్ చేసుకునే వెసులుబాటు లేకపోవడంతో పేదలు, వలస కూలీలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రీపెయిడ్ ఖాతాదారుల వ్యాలిడిటీ గడువు పెంచాలని నిర్ణయించాయి.
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఏప్రిల్ 20 వరకు వ్యాలిడిటీ గడువును పెంచుతున్నట్టు ప్రకటించింది. అదనంగా పది రూపాయల టాక్‌టైంను ఉచితంగా ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ విపత్కర సమయంలో ఈ టాక్‌టైం ఎంతగానో ఉపకరిస్తుందని పేర్కొంది. మరో టెలికం సంస్థ ఎయిర్‌టెల్ కూడా తమ ప్రీపెయిడ్ ఖాతాదారుల వ్యాలిడిటి గడువును వచ్చే నెల 17 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే, రూ. 10 టాక్‌టైమ్‌ను కూడా ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపింది.