Karnataka: క్వారంటైన్‌లో ఉన్న వారికి కర్ణాటక సర్కారు కీలక ఆదేశాలు

Karnataka govt orders to send selfies while in home quarantine
  • హోం క్వారంటైన్‌లో ఉన్నవారు రోజుకు 14 సెల్ఫీలు పంపాలి
  • నిద్రిస్తున్న సమయం ఇందుకు మినహాయింపు
  • పంపకుంటే ప్రభుత్వ క్వారంటైన్‌కు
కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్న వారు ప్రతి రోజు 14 సెల్ఫీలు పంపాలని ఆదేశించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల మధ్యలో సూచించిన నంబరుకు వీటిని పంపాలని, నిద్రిస్తున్న సమయం ఇందుకు మినహాయింపని పేర్కొంది.

ఇలా చేయని వారిని వెంటనే ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు పంపుతామని హెచ్చరించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సెల్ఫీని షేర్ చేయాలంటే తొలుత జీపీఎస్‌ను ఆన్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. క్వారంటైన్‌లో ఉన్నవారు పంపే సెల్ఫీలను ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. ఆ ఫొటోల్లో తేడా ఉందని అధికారులు గుర్తిస్తే వెంటనే వారింటికి చేరుకుని క్వారంటైన్‌ కేంద్రానికి తరలిస్తారు.
Karnataka
Home quarantine
selfie
Corona Virus

More Telugu News