Ram Gopal Varma: సీతారామశాస్త్రి రాసిన పాటకి బదులుగా వర్మ నా పాటను రికార్డు చేయించాడు: కోన

Kona venkat
  • 'సత్య'కి మాటలు రాశాను 
  • పాట అలా ఓకే అయింది 
  • సిరివెన్నెల మెచ్చుకున్నారన్న కోన
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో కోన వెంకట్ మాట్లాడుతూ, 'సత్య' సినిమా సమయంలో జరిగిన ఒక సంఘటనను గురించి ప్రస్తావించాడు. 'సత్య' సినిమాలో వర్మ నాతో మాటలు రాయించాడు. అయితే వాటికన్నా ముందే 'మామ.. కల్లు మామ' పాట రాశాను. ఈ పాటను సిరివెన్నెలతో రాయించాలని వర్మ అనుకున్నాడు.

 సిరివెన్నెల రాసిన వెర్షన్స్ వర్మకి నచ్చడం లేదు. క్రిమినల్స్ పాడుకునే పాటకి పాండిత్యంతో పనిలేదు. అందువలన సరదాగా నేను ఆ ట్యూన్ కి పాట రాసి వర్మకి వినిపించాను. ఆయన 'ఇదీ నాకు కావలసింది' అని వెంటనే రికార్డ్ చేయించాడు. ఆ కేసెట్ తీసుకెళ్లి సిరివెన్నెలగారికి వినిపించి, జరిగింది చెప్పవలసిన బాధ్యతను నాపైనే పెట్టాడు.

దాంతో ఆ కేసెట్ తీసుకెళ్లి నా పాటను రికార్డు చేశారని సిరివెన్నెల గారికి వినిపించవలసిన పరిస్థితి వచ్చింది. ఆయన ఏమనుకుంటారోననే టెన్షన్. అయితే ఆయన ఆ పాటను విని 'తను మరో పది వెర్షన్స్ రాసినా అలా వుండేది కాదు' అంటూ నన్ను హత్తుకున్నాడు. అదీ ఆయన గొప్పతనం" అని చెప్పుకొచ్చాడు.
Ram Gopal Varma
Kona
Sirivennela

More Telugu News