Tarun Bhaskar: తరుణ్ భాస్కర్ తో ఎన్టీఆర్ మూవీ?

Tarun Bhaskar Movie
  • 'ఆర్ ఆర్ ఆర్' పైనే ఎన్టీఆర్ దృష్టి 
  • అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి 
  •  ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ కోసమే తరుణ్ వెయిటింగ్ 
ఎన్టీఆర్ తాజా చిత్రంగా 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. ఎన్టీఆర్ అభిమానులంతా కూడా ఈ సినిమాపైనే పూర్తి దృష్టి పెట్టారు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయనున్నాడు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పైనే త్రివిక్రమ్ కసరత్తు చేస్తున్నాడు. ఆ తరువాత ప్రాజెక్టు తరుణ్ భాస్కర్ తో ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.

ఓ ఇంటర్వ్యూలో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, ఆల్రెడీ ఎన్టీఆర్ కి ఒక కథను వినిపించినట్టుగా చెప్పాడు. ఎన్టీఆర్ నుంచి సమాధానం రావలసి వుంది. తరుణ్ భాస్కర్ వైవిధ్యభరితమైన కథలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాడు. ఆయన టేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. తనదైన స్టైల్లో ఎన్టీఆర్ ను చూపించడానికి ఆయన ఆసక్తిని చూపుతున్నాడు. ఎన్టీఆర్ ఓకే అంటే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది. ఆ రెండు అక్షరాలు ఆయన నోటి నుంచి వచ్చే క్షణం కోసమే తరుణ్ భాస్కర్ ఎదురుచూస్తున్నాడు. ఎన్టీఆర్ ఏమంటాడో చూడాలి మరి.
Tarun Bhaskar
Ntr
Tollywood

More Telugu News