Andhra Pradesh: మాకు రెండు విడతలుగా జీతం ఇస్తామన్నారు: ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం

Two installments in salary for AP employees

  • కరోనా వైరస్ తో రాష్ట్రాల ఆర్థికస్థితిపై ప్రభావం
  • ఇప్పటికే ఉద్యోగుల జీతాల్లో కోత విధించిన తెలంగాణ
  • మొదట సగం జీతం ఇవ్వాలని ఏపీ సర్కారు నిర్ణయం
  • నిధులు సర్దుబాటు అయ్యాక మిగతా సగం

కరోనా లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఆయా ప్రభుత్వాలు తమ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే జీతంలో కోత విధిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించగా, ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు రెండు విడతలుగా జీతాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మీడియాకు తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగులకు రెండు విడతలుగా జీతం ఇస్తామని సీఎం జగన్ చెప్పారని, రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నందున తాము సీఎం సూచనకు అంగీకరించామని వెల్లడించారు. ఈ ఒక్క నెల మాత్రమే జీతం రెండు విడతలుగా ఇస్తామని సీఎం చెప్పినట్టు సూర్యనారాయణ వివరించారు. కరోనా పరిస్థితుల ప్రభావంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని, ఈ నెలలో సగం జీతం ఇస్తామని చెప్పారని, మిగిలిన జీతం నిధులు సర్దుబాటు అనంతరం ఇస్తామని తెలిపారని సూర్యనారాయణ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News