Gutta Jwala: ప్రేమ వ్యవహారం నిజమే... పెళ్లి కూడా చేసుకుంటున్నా: గుత్తా జ్వాల

Gutta Jwala confirms love and dating with actor Vishnu Vishal
  • నటుడు విష్ణు విశాల్ తో జ్వాల డేటింగ్
  • అధికారికంగా ప్రకటించిన బ్యాడ్మింటన్ స్టార్
  • త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నామని వెల్లడి
భారత బ్యాడ్మింటన్ డబుల్స్ రంగంలో అనేక విజయాలు సాధించిన గుత్తా జ్వాల ప్రస్తుతం కోచింగ్ రంగంలో బిజీగా ఉంది. అయితే ఇటీవల ఆట, శిక్షణ కంటే ప్రేమ, పెళ్లి వంటి విషయాల్లోనే జ్వాల పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణాది నటుడు విష్ణు విశాల్ తో సన్నిహితంగా ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దాంతో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని అందరూ నిర్ధారించారు.

తాజాగా జ్వాల కూడా ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. తాను విష్ణు విశాల్ తో డేటింగ్ చేస్తున్నది నిజమేనని అంగీకరించడమే కాదు, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నామని స్పష్టం చేసింది. పెళ్లి తేదీ ఖరారైన తర్వాత అందరికీ వెల్లడిస్తామని తెలిపింది. ఇటీవల కరోనా లాక్ డౌన్ తర్వాత విష్ణు విశాల్ ను ఉద్దేశించి "నిన్ను చాలా మిస్ అవుతున్నాను" అంటూ జ్వాల చేసిన ట్వీట్ అందరిలోనూ ఆసక్తి కలిగించింది.
Gutta Jwala
Vishnu Vishal
Love
Wedding
Badminton
Doubles

More Telugu News