New Delhi: మర్కజ్ సమావేశాలకు తెలంగాణ నుంచి 1030 మంది

1030 Telangana people attended to Delhi Markaz masjid meetings

  • ఒక్క జీహెచ్ఎంసీ పరధి నుంచే 603 మంది
  • ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో 74 మందికి కరోనా లక్షణాలు
  • 70 శాతం మందిని గుర్తించిన ప్రభుత్వం

ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మర్కజ్ మసీదు సమావేశాలకు తెలంగాణ నుంచి 1030 మందికిపైగా హాజరైనట్టు తేలింది. పాజిటివ్ కేసులు పెరగడానికి వీరే కారణమని నిర్ధారణ అయింది. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం మసీదు సమావేశాలకు వెళ్లొచ్చిన వారందరినీ గుర్తించి క్వారంటైన్‌కు పంపుతోంది. సమావేశంలో పాల్గొన్న వారిని, వారి కుటుంబ సభ్యులను ఒప్పించి క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 603 మంది ఉన్నారు. వారి కుటుంబాల్లో కొందరికి పరీక్షలు నిర్వహించగా 74 మందిలో కరోనా లక్షణాలు కనిపించాయి.

మర్కజ్ మసీదు సమావేశాలకు వెళ్లొచ్చిన వారిలో ఇప్పటికే 20 మందికి కరోనా  సోకినట్టు నిర్ధారణ కాగా, మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నిజాముద్దీన్ వెళ్లినవారిలో 70 శాతం మందిని గుర్తించిన ప్రభుత్వం, 90 శాతం మంది ఫోన్ నంబర్లను సేకరించింది. మిగిలిన వారి కోసం అధికారులు గాలిస్తున్నారు. ఢిల్లీ వెళ్లివచ్చిన వారి కుటుంబ సభ్యులు, వారితో సన్నిహితంగా ఉన్న దాదాపు 2 వేల మందిని క్వారంటైన్‌లో ఉంచారు. అన్ని కుటుంబాలు కలిపి దాదాపు 10 వేల మంది వరకు ఉంటారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

  • Loading...

More Telugu News