Ram: రామ్ హీరోగా మారుతి సినిమా

maruthi Movie
  • కిషోర్ తిరుమలతో మూడో సినిమా 
  • ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సాగే కథ 
  • త్వరలోనే పూజా కార్యక్రమాలు
రామ్ హీరోగా ఈ మధ్య వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సంచలన విజయాన్ని సాధించింది. ఆ తరువాత సినిమాను ఆయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న మూడో సినిమా ఇది. 'రెడ్' టైటిల్ తో నిర్మితమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా తరువాత దర్శకుడు మారుతితో కలిసి రామ్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు.

ఈ సారి కూడా రామ్ మాస్ ఎంటర్టైనర్ సినిమానే చేస్తున్నాడనే టాక్ వినిపించింది. కానీ అందులో నిజం లేదట. వరుసగా అదే జోనర్ సినిమాలు వద్దని రామ్ చెప్పడంతో, ఆయన కోసం మారుతి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను సిద్ధం చేశాడట. ఇటీవల మారుతి రూపొందించిన 'ప్రతిరోజూ పండగే' తరహాలో, ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్ కి ప్రాధాన్యతనిస్తూ సాగుతుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలకి ముహూర్తాన్ని ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది.
Ram
Maruthi Movie
Tollywood

More Telugu News