Roja: దేశం మొత్తం లాక్డౌన్లో ఉంటే.. విలేజ్ వారియర్స్ మాత్రం పని చేస్తున్నారు.. హ్యాట్సాఫ్: వాలంటీర్లకు ఎమ్మెల్యే రోజా ప్రశంసలు
- ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేస్తోన్న వాలంటీర్లు
- వేలి ముద్ర స్థానంలో ఫొటో గుర్తింపుతో పింఛన్లు
- వారి సేవలను కొనియాడిన రోజా
ఆంధ్రప్రదేశ్లో పింఛను లబ్ధిదారులకు అందాల్సిన డబ్బును కరోనా విజృంభణ నేపథ్యంలో గ్రామ వాలంటీర్లు అందిస్తున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేశారు. వేలి ముద్ర స్థానంలో ఫొటో గుర్తింపుతో పింఛన్లు అందజేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వాలంటీర్ల సేవలను వైసీపీ ఎమ్మెల్యే రోజా కొనియాడారు. 'దేశం మొత్తం లాక్డౌన్లో ఉంటే.. పౌరులు ఇంట్లోనే ఉంటూ కొవిడ్-19తో పోరాడుతుంటే, మన ఏపీ విలేజ్ వారియర్స్ మాత్రం.. ఇబ్బందులు పడుతున్న వారికి సాయం అందిస్తూ పని చేస్తున్నారు. హ్యాట్సాఫ్ టు వాలంటీర్స్.. పింఛనులను డోర్ డెలివరీ చేస్తూ గొప్ప సేవలు అందిస్తున్నారు' అని ట్వీట్ చేశారు.