america: అమెరికాలోని ఇదాహో రాష్ట్రంలో భూకంపం
- కరోనాతో ఇంటికే పరిమితమవుతున్న అమెరికన్లు
- 20-30 సెకన్ల పాటు కంపించిన భూమి
- 6.5 తీవ్రతతో ఇదాహోలో భూకంపం
- ఇంట్లో ఉన్నా భయపడాల్సి వస్తోందంటోన్న అమెరికన్లు
ప్రతి రోజు వేలల్లో పెరిగిపోతున్న కరోనా కేసులతో తీవ్ర ఆందోళనలో ఉన్న అమెరికాను భారీ భూకంపం భయపెట్టింది. ఇదాహో రాష్ట్ర వ్యాప్తంగా 6.5 తీవ్రతతో భూమి కంపించిందని ఈ రోజు నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకటించింది. నిన్న సాయంత్రం 20-30 సెకన్ల పాటు భూమి కంపించిందని, బోయిస్‌కు ఈశాన్యంగా ఉన్న ఓ పర్వత ప్రాంతంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు.
భూకంపంతో ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. తమ ఇంట్లో వస్తువులు కదులుతుండగా తీసిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. లాక్‌డౌన్‌తో ఇంట్లో కూర్చొని పని చేసుకుంటున్నప్పటికీ తాము భయానికి గురి కావాల్సి వచ్చిందని అంటున్నారు. అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 4000కు చేరువలో ఉన్న విషయం తెలిసిందే.