Galla Jayadev: ప్రమాదకర దశ ప్రారంభమైంది: ఏపీ ప్రజలకు గల్లా జయదేవ్ సూచనలు
- లాక్ డౌన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించండి
- సామాజిక దూరాన్ని పాటించండి
- ఈ 7 రోజులు చాలా కీలకం
ఏపీలో కరోనా వైరస్ కేసులు ఊహించని విధంగా పెరిగాయి. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు 43 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 87కి చేరింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఏపీ ప్రజలకు కీలక సూచనలు చేశారు.
'ఆంధ్రప్రదేశ్ లో 43 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో మొత్తం కేసులు 87కు చేరాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని విన్నవిస్తున్నా. కరోనా విస్తరించకుండా అందరూ సామాజిక దూరాన్ని పాటించండి. అందరి సహకారంతోనే కరోనాను కట్టడి చేయగలం' అని గల్లా జయదేవ్ ట్వీట్ చేశారు.
కంటికి కనిపించని శత్రువుతో మనం యుద్దం చేస్తున్నామని... ప్రమాదకరమైన దశ మొదలైందని చెప్పారు. ఈ 7 రోజులు చాలా కీలకమైనవని తెలిపారు. అందరూ ఇంట్లోనే ఉండాలని... బయటి నుంచి ఎవరినీ రానివ్వొద్దని సూచించారు. కుటుంబసభ్యులైనా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. కరోనాను ఎవరూ తేలికగా తీసుకోవద్దని హెచ్చరించారు. మన మనుగడ మన చేతుల్లోనే ఉందని చెప్పారు.