Sensex: మరో భారీ పతనాన్ని చవిచూసిన మార్కెట్లు
- 1,203 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 344 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 9 శాతానికి పైగా నష్టపోయిన టెక్ మహీంద్రా
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దాని ప్రభావం మార్కెట్లపై పడింది. ఇన్వెస్టర్లు తమ వాటాలను అమ్ముకునేందుకే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,203 పాయింట్లు నష్టపోయి 28,265కి పడిపోయింది. నిఫ్టీ 344 పాయింట్లు కోల్పోయి 8,254కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హీరో మోటో కార్ప్ (2.21%), బజాజ్ ఆటో (1.12%), బజాజ్ ఫైనాన్స్ (0.40%), టైటాన్ కంపెనీ (0.35%).
టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-9.21%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-8.81%), టీసీఎస్ (-6.23%), ఇన్ఫోసిస్ (-5.65%), యాక్సిస్ బ్యాంక్ (-5.50%).