ICMR: కోవిడ్ బాధితులను కలిసిన వారికి మాత్రమే హైడ్రాక్సీ క్లోరోక్విన్: ఐసీఎంఆర్

Hydroxy chloroquine is only for those who have met Kovid victims ICMR
  •  ఎవరికి పడితే వారికి ఈ మందు ఇవ్వకూడదు
  • ఐసీయూలో చికిత్స పొందుతున్న వారికి మాత్రం ఇవ్వొచ్చన్న కేంద్ర ఆరోగ్య శాఖ
  • హెచ్ఐవీ డ్రగ్స్‌ను ప్రతిపాదిత జాబితా నుంచి తొలగించిన వైనం
హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధం అందరి కోసం కాదని, దానిని ఎవరికి పడితే వారికి వాడొద్దని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సీనియర్ శాస్త్రవేత్త రమణ్ గంగాఖేడ్కర్ తెలిపారు. కరోనా బాధితులను కలిసిన వారికి మాత్రమే ఈ మందును ఇవ్వాలని సూచించారు.

అయితే, ఐసీయూలో ఉంచి వైద్యం చేయాల్సిన పరిస్థితే వస్తే, అటువంటి రోగులకు ఈ ఔషధాన్ని అజిత్రోమైసిన్‌తో కలిపి ఇవ్వొచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా వెల్లడించింది. అయితే, 12 ఏళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, పాలిచ్చే తల్లుల విషయంలో మాత్రం ఈ ఔషధ వాడకం గురించి ప్రస్తావించలేదు. అలాగే, హెచ్ఐవీని నిరోధించే లోపినావిర్, రిటోనావిర్ ఔషధాల వల్ల కరోనా బాధితులకు పెద్దగా ప్రయోజనం లేదని తేల్చి చెప్పడమే కాకుండా ప్రతిపాదిత జాబితా నుంచి వాటిని తొలగించారు.
ICMR
hydroxychloroquine
Corona Virus
HIV Drugs

More Telugu News