Italy: వణుకుతున్న యూరప్.. 30 వేలు దాటిన మరణాలు!

Death toll crossed 30 thousand in Europe

  • 4.58 లక్షలకు చేరుకున్న కరోనా కేసులు
  • ఇటలీలో అత్యధికంగా 12,428 మంది మృతి
  • వైద్య విద్యార్థులు, రిటైర్డ్ డాక్టర్లకు ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్ పిలుపు

కోవిడ్ 19తో యూరప్ వణుకుతోంది. ఇక్కడ మొత్తం 4,58,601 కేసులు నమోదు కాగా, నిన్నటికి మృతి చెందిన వారి సంఖ్య 30 వేలు దాటిపోయింది. మొత్తంగా 30,063 మంది కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇటలీలో అత్యధికంగా 12,428 మంది మృతి చెందగా, స్పెయిన్‌లో 8,189 మంది, ఫ్రాన్స్‌ లో 3,523 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 40 వేలను దాటేసింది.

కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు స్పెయిన్ తమ దేశంలోని ఆసుపత్రుల్లో బెడ్లను 20 శాతం పెంచడమే కాకుండా క్రీడా కేంద్రాలు, లైబ్రరీలు, ఎగ్జిబిషన్‌ సెంటర్లను కూడా ఆసుపత్రులుగా మార్చేందుకు రెడీ అవుతోంది. హోటళ్లను రికవరీ గదులుగా మార్చింది. కరోనా రోగులకు సేవలు అందించేందుకు ముందుకు రావాల్సిందిగా వైద్య విద్యార్థులు, రిటైర్డ్ వైద్యులు, విమానాల్లోని మెడికల్ సిబ్బందిని ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు కోరాయి.    

  • Loading...

More Telugu News