south africa: లాక్డౌన్ ఎఫెక్ట్: నిలిచిన దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్ పెళ్లి
- లిజెల్లీ అక్కడి మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు
- ఈనెల 10వ తేదీన ఆమె వివాహం
- ప్రస్తుతం లాక్డౌన్ ఉండడంతో వాయిదా
లాక్డౌన్ కారణంగా దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు లిజెల్లీ వివాహం నిలిచిపోయింది. ఓపెనర్ అయిన లిజెల్లీ తన ప్రియుడు తాంజాక్రోనేను ఈ నెల 10వ తేదీన మనువాడాలని నిర్ణయించుకుంది. అయితే కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో దక్షిణాఫ్రికాలోనూ ప్రస్తుతం 21 రోజుల లాక్డౌన్ కొనసాగుతోంది. లిజెల్లీ పెళ్లి నాటికి లాక్డౌన్ 15వ రోజుకు చేరుతుంది. ఈ పరిస్థితుల్లో పెళ్లి సాధ్యం కాదని లిజెల్లీ కుటుంబం భావించడంతో నిలిచిపోయింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా మహిళా జట్టు ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. లాక్డౌన్ కారణంగా ఈ మ్యాచ్లు కూడా రద్దయ్యాయి.