Mithun Reddy: మోదీ సార్.. మా ఖజానా ఖాళీ అయింది.. ఆదుకోండి: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి

YSRCP MP Mithun Reddy Request Modi for financial help
  • కరోనా నేపథ్యంలో ఖజానాపై భారం పడింది
  • ఆర్థిక ఉద్దీపనల ప్యాకేజీ ప్రకటించండి
  • పరిశ్రమలు, వ్యాపారాల రుణాలపై మారటోరియం విధించండి
కరోనా వైరస్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందంటూ ప్రధాని మోదీకి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లేఖ రాశారు. ఆర్థిక వనరులు అడుగంటిపోయాయని లేఖలో పేర్కొన్నారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, పేదలకు ఆర్థిక సాయంతో ఖజానాపై తీవ్రమైన భారం పడిందని చెప్పారు. ఇతర రాష్ట్రాల పరిస్థితి కూడా ఇదే మాదిరి ఉందని... ఈ నేపథ్యంలో జీడీపీలో 8 నుంచి 10 శాతం వరకు ఆర్థిక ఉద్దీపనల ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. పరిశ్రమలు, వ్యాపారాల రుణాల రికవరీని ఏడాది పాటు వాయిదా వేయాలని విన్నవించారు. ద్రవ్య లోటును అధిగమించేందుకు ఆర్బీఐతో కలిసి చర్యలు తీసుకోవాలని అన్నారు.
Mithun Reddy
YSRCP
Narendra Modi
BJP
Corona Virus

More Telugu News