Sensex: ఒత్తిడికి గురైన బ్యాంకింగ్, ఐటీ షేర్లు.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 674 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 170 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 9 శాతానికి పైగా నష్టపోయిన యాక్సిస్ బ్యాంక్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఐటీ, బ్యాంకింగ్, ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో మార్కెట్లు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 674 పాయింట్లు నష్టపోయి 27,590కి పడిపోయింది. నిఫ్టీ 170 పాయింట్లు కోల్పోయి 8,083కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (9.42%), ఐటీసీ (6.88%), ఓఎన్జీసీ (6.24%), టెక్ మహీంద్రా (1.85%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (0.81%).
టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-9.16%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-8.49%), ఐసీఐసీఐ బ్యాంక్ (-8.01%), టైటాన్ కంపెనీ (-7.90%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-5.92%).