Corona Virus: ప్రపంచ వ్యాప్తంగా మరింత పెరిగిన కరోనా కేసులు.. మృతులు

coronavirus cases in world

  • 11.18 లక్షల మందికి కొవిడ్‌-19
  • 59,200 మందికి పైగా మృతి
  • కోలుకున్న 2.29 లక్షల మంది 
  • అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య అత్యధికంగా 2,77,475 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు 205 దేశాలకు విస్తరించింది. 11.18 లక్షల మందికి కొవిడ్‌-19 వైరస్ సోకింది. ప్రపంచ వ్యాప్తంగా 59,200 మందికి పైగా కరోనా బాధితులు చనిపోయారు. ఇప్పటివరకు 2.29 లక్షల మంది కోలుకున్నారు.

ఏ దేశంలో ఎంతమంది?
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య అత్యధికంగా 2,77,475గా ఉంది. 7,402 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటలీలో 1,19,827 మందికి కరోనా సోకగా వారిలో 14,681 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్‌లో 1,19,199 కేసులు నమోదుకాగా, 11,198 మంది మృతి చెందారు. జర్మనీలో 91,159 కేసులు నమోదుగాకా, 1,275 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఫ్రాన్స్‌లో కరోనా కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు  64,338 కేసులు నమోదు కాగా, 6,507 మంది మృతి చెందారు. యూకేలో 38,168 కేసులు నమోదుకాగా, 3,605 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్‌లో 9216 మందికి సోకగా, 365 మంది చనిపోయారు. కెనడాలో 12,375 కరోనా కేసులు రాగా, 208 మంది మృతి చెందారు.

  • Loading...

More Telugu News