Baba Ramdev: చైనా అమానుష, అనైతిక చర్యలకు పాల్పడింది.. ఆ దేశాన్ని బహిష్కరించాల్సిందే!: రామ్ దేవ్ బాబా
- మొత్తం ప్రపంచాన్ని ఘోర ప్రమాదంలో పడేసింది
- ప్రపంచ సమాజం చైనాను శిక్షించాల్సిందే
- భారత్ దౌత్యపరమైన చొరవ తీసుకోవాలి
కరోనా వైరస్ పుట్టిన చైనాపై యోగాగురు రామ్ దేవ్ బాబా మండిపడ్డారు. 'చైనా నిజంగా అమానుష, అనైతిక చర్యలకు పాల్పడింది. మొత్తం ప్రపంచాన్ని ఘోర ప్రమాదంలో పడేసింది. దీనికి గానూ ప్రపంచ సమాజం చైనాను శిక్షించాల్సిందే. రాజకీయంగా, ఆర్థికంగా ఆ దేశాన్ని బహిష్కరించాలి. ఈ విషయంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్ దౌత్యపరమైన చొరవ తీసుకోవాలి' అని బాబా హిందీలో ట్వీట్ చేశారు.
కాగా, కరోనా వైరస్ చైనాలో వుహాన్‌లో గత ఏడాదే పుట్టుకొచ్చింది. అయితే, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 1.2 మిలియన్ల మందికి సోకింది. చైనానే ఈ పరిస్థితికి కారణమని అమెరికా పలు సార్లు నిందించింది. మొదట ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండడంతోనే అన్ని దేశాలకు వైరస్ విస్తరించిందని విమర్శలున్నాయి.