Tirumala: నేటి నుంచి తిరుమలలో వసంతోత్సవాలు... రేపటి స్వర్ణ రథోత్సవం రద్దు!

Vasantotsavams in Tirumala from Today Without Piligrims

  • మూడు రోజుల వసంతోత్సవాలు మొదలు
  • నేడు స్నపన తిరుమంజనం
  • 14 తరువాత భక్తుల దర్శనాలపై నిర్ణయం

తిరుమల శ్రీ వెంకటేశ్వరుని వసంతోత్సవాలు నేడు ప్రారంభం అయ్యాయి. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ వేడుకలు భక్తులు లేకుండానే జరుగనున్నాయి. ఆలయంలోని కల్యాణ వేదిక వద్దే ఈ ఉత్సావాలను నిర్వహిస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. నేడు మలయప్ప స్వామి, ఉభయ దేవేరులకు స్నపన తిరుమంజనం జరుగుతుందని వెల్లడించారు.

 వసంతోత్సవాల్లో భాగంగా రేపు జరగాల్సిన స్వర్ణ రథోత్సవాన్ని రద్దు చేశామని పేర్కొన్నారు. తిరుపతిలో పేదల ఆకలిని తీర్చేందుకు రోజుకు 50 వేల ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నామని, అవసరమైతే, మరిన్ని తయారు చేసి అందిస్తామని వెల్లడించారు. కాగా, కరోనా విజృంభణ,లాక్ డౌన్ నేపథ్యంలో, తిరుమలలో స్వామివారి దర్శనాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 14 తరువాత పరిస్థితిని బట్టి దర్శనాల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News