Goa: గోవాలో చిక్కుకుపోయిన 150 మంది స్పెయిన్ పర్యాటకులు.. సురక్షితంగా తరలింపు

150 Spanish tourists stranded in Goa Safe evacuation
  • సహకరించిన భారత ప్రభుత్వం
  • గోవా విమానాశ్రయంలో పరీక్షలు
  • ప్రత్యేక విమానంలో మాడ్రిడ్‌కు తరలింపు
లాక్‌డౌన్ కారణంగా గోవాలో చిక్కుకుపోయిన 150 మంది స్పెయిన్ పర్యాటకులు క్షేమంగా తమ దేశానికి చేరుకున్నారు. దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో దానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో అప్పటికే గోవాలో ఉన్న వీరంతా అక్కడే నిలిచిపోయారు. విమాన సర్వీసులు రద్దు కావడంతో స్వదేశానికి వెళ్లే వీలు లేకుండా పోయింది.

దీంతో స్పందించిన స్పెయిన్ ప్రభుత్వం.. భారత ప్రభుత్వ సహకారంతో నిన్న వీరందరినీ తమ దేశానికి తరలించింది. గోవా అంతర్జాతీయ విమానాశ్రయంలో వీరందరికీ పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక విమానంలో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ తరలించారు.
Goa
Spain
madrid
Corona Virus
Lockdown

More Telugu News