PASRTC: 15 నుంచి ఏపీఎస్ ఆర్టీసీ బస్సులకు రిజర్వేషన్లు!

APSRTC Reservations Started For Busses From April 15
  • 14తో ముగియనున్న లాక్ డౌన్
  • ఏసీ బస్సులు మినహా మిగతా వాటికి రిజర్వేషన్
  • ఓపీఆర్ఎస్ విధానంలో రిజర్వేషన్లు
ఈ నెల 14తో దేశవ్యాప్తంగా లాక్ డౌన్  గడువు ముగియనుండగా, ఇప్పటికే ఎయిర్ ఇండియా మినహా మిగతా పౌర విమానయాన సంస్థలు 15వ తేదీ ప్రయాణాలకు బుకింగ్స్ ప్రారంభించాయి. లాక్ డౌన్ ను తొలగిస్తూ, కేంద్రం నిర్ణయిస్తే, 15వ తేదీ నుంచి రైళ్లను నడిపించేందుకు సిద్ధమని చెప్పిన ఇండియన్ రైల్వేస్, ఇప్పటికే బుకింగ్స్ ను స్వీకరించడం ప్రారంభించాయి.

ఇక, ఏపీఎస్ ఆర్టీసీ సైతం 15 నుంచి బుకింగ్స్ ను ప్రారంభించింది. ఓపీఆర్ఎస్ ద్వారా ప్రయాణికులు రిజర్వేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రస్తుతానికి ఏసీ బస్సులకు మాత్రం ఇంకా రిజర్వేషన్ మొదలు కాలేదు. ఏసీ బస్ లను ఎక్కేందుకు ప్రజలు ఆసక్తి చూపించక పోవచ్చన్న ఉద్దేశంలో అధికారులు ఉన్నారని తెలుస్తోంది. కాగా, విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే 127 రైళ్లకు 15 నుంచి బుకింగ్స్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే.
PASRTC
OPRS
Reservations
April 15

More Telugu News