Britain PM: బ్రిటన్ ప్రధానిలో తగ్గని కరోనా లక్షణాలు.. ఆసుపత్రిలో చేరిన బోరిస్

British PM Boris Johnson Hospitalised 10 Days After Testing Positive

  • మార్చి 27న ప్రధానిలో కనిపించిన వైరస్ లక్షణాలు
  • వారం రోజులుగా సెల్ఫ్ ఐసోలేషన్
  • బాగానే ఉన్నానన్న ప్రధాని

పది రోజులుగా సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నప్పటికీ కరోనా లక్షణాలు తగ్గకపోవడంతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (57) నిన్న ఆసుపత్రిలో చేరారు. పది రోజుల క్రితం మార్చి 27న జాన్సన్‌కు నిర్వహించిన పరీక్షల్లో కొద్దిపాటి కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో ఆయన గత వారం రోజులుగా డౌనింగ్ స్ట్రీట్ నివాసంలో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఏడు రోజుల తర్వాత ఆయన విధులు నిర్వర్తించవచ్చని అధికారులు తెలిపారు. అయితే, వారం రోజులు పూర్తియినా ఆయనలో ఇంకా వైరస్ లక్షణాలు కనిపించడంతో వ్యక్తిగత వైద్యుడి సలహా మేరకు ప్రధాని ఆసుపత్రిలో చేరారు.

తన ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గానే ఉందని ప్రధాని ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఏడు రోజులు పూర్తయినా తనలో ఇంకా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు తెలిపారని, శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారని బోరిస్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైరస్ లక్షణాలు పూర్తిగా తొలగిపోయేంత వరకు సెల్ఫ్ క్వారంటైన్‌లోనే ఉంటానని వివరించారు.

  • Loading...

More Telugu News