Uttar Pradesh: మసీదులో దాక్కున్న 14 మంది తబ్లిగీ సభ్యులు.. పోలీసులకు పట్టించిన ఆహార పొట్లాల సరఫరా!

UP Police arrest 14 Tablighi jamaat members

  • లక్నో కంటోన్మెంట్‌లోని సదర్ బజార్‌లో ఘటన
  • మిలటరీ ఇంటెలిజెన్స్‌కు సమాచారం
  • అందరినీ అరెస్ట్ చేసిన పోలీసులు

లక్నోలోని ఆర్మీ కంటోన్మెంటులోని సదర్ బజార్‌లో ఉన్న అలీజాన్ మసీదులోకి ఆహార పొట్లాలు సరఫరా అవుతుండడంతో అనుమానించిన కొందరు వ్యక్తులు మిలటరీ ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందించారు. నిఘా వేసిన అధికారులు మసీదులో తబ్లిగీ జమాత్ సభ్యులు దాక్కున్నట్టు నిర్ధారించుకుని విషయాన్ని పోలీసులకు చేరవేశారు.

దీంతో మసీదుపై దాడిచేసిన పోలీసులు 14 మంది తబ్లిగీ జమాత్ సభ్యులను అరెస్ట్ చేశారు. వీరంతా షహరాన్‌పూర్ గ్రామానికి చెందిన వారని, ఢిల్లీలోని మర్కజ్  మసీదు సమావేశానికి హాజరై వచ్చి మసీదులో దాక్కున్నట్టు పోలీసులు తెలిపారు. వారి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. పట్టుబడిన వారిని ఐసోలేషన్‌కు తరలించారు. వీరందరిపైనా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఇక పట్టుబడిన వారిలో 8 మందికి కరోనా పాజిటివ్ అని రిపోర్టుల్లో తేలింది. మసీదులో ఉండగా వీరికి చికిత్స చేసిన వైద్యుడు డాక్టర్ ఆసిఫ్‌ఖాన్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మసీదును శానిటైజ్ చేశారు. మసీదులో దాక్కున్న తబ్లిగీ సభ్యులు చుట్టుపక్కల బజార్లలో పండ్లు, కూరగాయలు కొన్నట్టు తేలడంతో వైద్యాధికారులు వారిని కూడా పరీక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News