Renu Desai: ఇంకొన్ని రోజులు ఓపిక పట్టండి.. మీ మీద మీరు నమ్మకం ఏర్పరుచుకోండి: రేణు దేశాయ్

Wait for some more days says Renu Desai
  • కరోనా కట్టడి కోసమే లాక్ డౌన్ విధించారు
  • ఇంట్లో కూర్చోవడం కష్టమే
  • మనం అనుకుంటే ఏదైనా చేయగలం
కరోనా వైరస్ విస్తరించకుండా కట్టడి చేయడం కోసమే లాక్ డౌన్ విధించారని... అయినా కొందరు దీన్ని పట్టించుకోకుండా బయట తిరుగుతున్నారని, ఇది మంచిది కాదని సినీ నటి రేణు దేశాయ్ అన్నారు. మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం అందరూ ఇంట్లోనే కూర్చోవాలని విన్నవించారు. ప్రపంచం మొత్తం కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని... ఎవరూ బయటకు వెళ్లొద్దని కోరారు. బాల్కనీ నుంచి రోడ్లను చూస్తున్నానని... వాహనాలు తిరుగుతూనే ఉన్నాయని అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఇంట్లో కూర్చోవడం చాలా కష్టమేనని... అయితే మనం అనుకుంటే ఏదైనా చేయగలమని రేణు దేశాయ్ అన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్తే... ఎవరికి వైరస్ ఉందో, ఎవరికి లేదో మనకు తెలియదని చెప్పారు. వైరస్ సోకిన వ్యక్తికి దగ్గరైతే అ వైరస్ మీకు అంటుకుంటుందని... ఆ తర్వాత  ఇంట్లోని వారికి కూడా సోకుతుందని అన్నారు. అందుకే కొన్ని రోజులు ఓపిక పట్టాలని, ఇంట్లోనే ఉండాలని చెప్పారు. మీ మీద మీరు నమ్మకం ఏర్పరుచుకోవాలని అన్నారు. కరోనా కట్టిడికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని చెప్పారు.
Renu Desai
Tollywood
Corona Virus

More Telugu News