Kanipakam: కాణిపాకం ఆలయంలో అన్యమతస్తులకు వసతి కల్పించారంటూ వార్తలు.. ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసిన ఐవైఆర్!

How entry was allowed to other faiths in to Kanipakam asks IYR Krishna Rao

  • ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఐవైఆర్ డిమాండ్
  • అన్యమతస్తుల కోసం ప్రాంగణాన్ని వాడుతుండటంపై అభ్యంతరం
  • ఆలయ ప్రాంగణమా? లేక వసతి సదుపాయమా? అంటూ ప్రశ్న

తాజాగా ప్రఖ్యాత కాణిపాకం వినాయక ఆలయంలో అన్యమతస్తులకు ఏపీ ప్రభుత్వం వసతి ఏర్పాటు చేసిందంటూ వస్తున్న వార్తలపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందిస్తూ, ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.

ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఐవైఆర్ అన్నారు. ఇది ఆలయ ప్రాంగణమా? లేక వసతి సదుపాయమా? అని నిలదీశారు. ఇంకెక్కడా వసతి సదుపాయమే లేనట్టు... దీన్ని అన్యమతస్తుల కోసమే వాడుతుండటంలో అంతరార్థం ఏమిటని మండిపడ్డారు. ఇతర మతస్తులను ఆలయ ప్రాంగణంలోకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ప్రాంగణం నుంచి అన్యమతస్తులు వెలుపలకు వస్తున్న వీడియోను షేర్ చేశారు.

  • Loading...

More Telugu News