Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Thamanna and Mehreen not included in the sequel
  • 'ఎఫ్ 3'లో హీరోయిన్ల పాత్రల్లో మార్పులు!
  • బాలకృష్ణ, బోయపాటి చిత్రం అప్ డేట్ 
  • రాజమౌళి సినిమా మరోసారి వాయిదా?
 *  వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'ఎఫ్ 2' చిత్రానికి సీక్వెల్ నిర్మిస్తున్న సంగతి విదితమే. అయితే, ఈ సీక్వెల్ లో కొన్ని పాత్రలు ఉండవని తెలుస్తోంది. వెంకీ, వరుణ్ పాత్రలు కొనసాగుతాయనీ, అయితే తమన్నా, మెహ్రీన్ పాత్రలు ఉండవని తెలుస్తోంది. అంటే, 'ఎఫ్ 2' కథకి ఈ 'ఎఫ్ 3' కొనసాగింపుగా వుండదట!
*  బాలకృష్ణ, బోయపాటి కలయికలో రూపొందుతున్న భారీ చిత్రం తొలి షెడ్యూలు ఆమధ్య రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. ప్రస్తుత లాక్ డౌన్ కారణంగా తదుపరి షెడ్యూలు వాయిదా పడింది. ఒకవేళ పరిస్థితులు కుదుటపడితే తాజా షెడ్యూలు షూటింగును వచ్చే నెలలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.
*  ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' చిత్రం షూటింగ్ మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెలలో ప్రారంభం కావలసిన భారీ షెడ్యూలు లాక్ డౌన్ కారణంగా వాయిదా పడడంతో, చిత్రం విడుదల కూడా వాయిదా పడుతుందని అంటున్నారు. అంటే వచ్చే ఏడాది జనవరి 8న ఈ భారీ చిత్రం విడుదల ఉండక పోవచ్చు!  

Thamanna
Mehreen
Balakrishna
Boyapati Sreenu
Rajamouli

More Telugu News