Murali Mohan: హీరోగా తొలి సినిమా చేశాక ఏడాది వరకూ ఖాళీగానే ఉండాల్సి వచ్చింది: మురళీ మోహన్

Murali Mohan

  • ఏలూరులో చదువుకునేవాడిని 
  •  నాటకాలు వేసేవాడిని 
  • 'జగమే మాయ'తో తొలి ఛాన్స్ వచ్చిందన్న మురళీ మోహన్

కథానాయకుడిగా .. నిర్మాతగా మురళీమోహన్ ఎన్నో విజయాలను అందుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కెరియర్ ను గురించి ప్రస్తావించారు. "నేను ఏలూరులోని కాలేజ్ లో చదువుకున్నాను. మొదటి నుంచి కూడా వ్యాపార వ్యవహారాలపైనే దృష్టి ఉండేది. అందువలన చదువు అంతటితో ఆగిపోయింది. అయితే ఆ సమయంలో హీరో కృష్ణగారు .. క్రాంతికుమార్ గారు అదే కాలేజ్ లో చదువుకునేవారు.

చదువు ఆపేశాక విజయవాడలో నేను ఓ బిజినెస్ ను మొదలుపెట్టాను. కాలేజ్ లో నేను సరదాగా నాటకాలు వేసేవాడిననే విషయం క్రాంతికుమార్ కి తెలుసు. ఆయన చెన్నై వెళ్లి 'శారద' సినిమాకి నిర్మాతగా మారాడు. ఆ తరువాత సినిమాను ఆయన నాతో చేస్తానని అన్నాడు. చెన్నై పిలిపించి ఫొటోలు తీయించాడు. ఆ ఫొటోలు చూసిన అట్లూరి పూర్ణచంద్రరావు గారు 'జగమే మాయ' సినిమాలో హీరోగా ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమాలో విలన్ గా గిరిబాబు చేశారు. సినిమా విడుదల తరువాత విలన్ గా గిరిబాబు బిజీ అయ్యారు. నేను మాత్రం ఏడాది పాటు ఖాళీగా ఉండాల్సి వచ్చింది" అంటూ నవ్వేశారు.

  • Loading...

More Telugu News