Puri Jagannadh: పోలీసుల వల్ల కాకపోవడంతో కెన్యాలో మసాయ్ తెగవారిని తీసుకువస్తున్నారు: పూరీ జగన్నాథ్
- ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ స్వైరవిహారం
- కెన్యాలో కర్ఫ్యూ
- ప్రజలను నియంత్రించలేకపోతున్న పోలీసులు
- మసాయ్ తెగ యోధుల సేవలు వినియోగించుకోనున్న కెన్యా సర్కారు
కరోనా మహమ్మారి ఒక ఖండానికే పరిమితం కాకుండా ప్రపంచంలో అన్నిచోట్లకు వ్యాపించింది. ఈ వైరస్ విలయతాండవానికి అగ్రరాజ్యాలు సైతం కుదేలయ్యాయి. కెన్యా వంటి చిరు దేశాలు కూడా శక్తికి మించి పోరాడుతున్నాయి. దీనిపై ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆసక్తికర వివరాలు తెలిపారు.
కెన్యాలో లాక్ డౌన్ అమలు చేయడంలో పోలీసులు విఫలమవడంతో అక్కడి ప్రభుత్వం మసాయ్ తెగవారిని కర్ఫ్యూ సేవలకు రంగంలోకి దింపుతోందని వెల్లడించారు. ఓ సింహాన్ని తన బల్లెంతో చంపలేని వాడ్ని మసాయ్ తెగలో అసలు మనిషిగానే గుర్తించరని, అలాంటి ధైర్యశాలులను కర్ఫ్యూ కోసం మోహరిస్తున్నారని తెలిపారు. వీధుల్లో ఒక్క చీమ కూడా కనిపించకుండా చేసేందుకు, పెద్ద సంఖ్యలో మసాయ్ యోధులను తీసుకురావాల్సిందిగా వారి నాయకుడ్ని కెన్యా ప్రభుత్వం ఆదేశించిందని పూరీ జగన్నాథ్ ట్వీట్ చేశారు.