Eetala Rajender: గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఆసుపత్రిని సిద్ధం చేశాం: మంత్రి ఈటల రాజేందర్
- గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో 1500 పడకల ‘కోవిడ్’ ఆసుపత్రి
- ఆసుపత్రిని పరిశీలించిన ఈటల, కేటీఆర్, వైద్యాధికారులు
- ‘కరోనా’ కట్టడికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్న ఈటల
తెలంగాణలో కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హైదరాబాద్, గచ్చిబౌలిలో 1500 పడకల ‘కోవిడ్’ ఆసుపత్రిని సిద్ధం చేసింది. ఈ విషయాన్ని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ టవర్ లో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిని మంత్రి కేటీఆర్, ఈటల, వైద్యాధికారులు కలసి ఈ రోజు సందర్శించారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ, మరో 22 వైద్యకళాశాలల ఆసుపత్రులను కూడా కోవిడ్ హాస్పిటల్స్ గా మార్చామని చెప్పారు. ‘కరోనా’ కట్టడికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. అనంతరం, మొయినాబాద్ లోని భాస్కర్ మెడికల్ కళాశాల ఆసుపత్రిని సందర్శించేందుకు వారు వెళ్లారు. ఆ ఆసుపత్రిలోని అన్ని వార్డులను తనిఖీ చేశారు.