RBI: మారటోరియం నిబంధన అందరికీ వర్తింపజేయాలి: ఆర్బీఐ తాజా ఆదేశాలు
- ఇటీవల మూడు నెలల పాటు మారటోరియం విధించిన ఆర్బీఐ
- డిఫాల్ట్ గా అందరికీ వర్తింపజేయాలని తాజా సూచన
- ఈమెయిల్ ద్వారా అన్ని బ్యాంకులకు, ఫైనాన్స్ సంస్థలకు సందేశం
లాక్ డౌన్ నేపథ్యంలో రుణగ్రహీతలు మూడు నెలల పాటు ఈఎంఐలు చెల్లించనవసరం లేదంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వెసులుబాటును ఆయా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు రుణగ్రహీతలు కోరితేనే అమలు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆర్బీఐ తాజాగా, మారటోరియం సదుపాయాన్ని తప్పనిసరిగా అందరు రుణగ్రహీతలకు వర్తింపజేయాలని స్పష్టం చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఓ రుణగ్రహీత తనకు ఈ సౌకర్యం అక్కర్లేదని చెబితేనే అతడ్ని మారటోరియం పరిధి నుంచి తప్పించాలని ఆర్బీఐ ఆదేశించింది. ఎవరైనా ప్రత్యేకంగా కోరితే తప్ప దీన్ని డిఫాల్ట్ గా అందరు రుణగ్రహీతలకు వర్తింపజేయాలంటూ అన్ని బ్యాంకులకు, ఫైనాన్స్ సంస్థలకు ఈమెయిల్ ద్వారా స్పష్టం చేసింది.