Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Kajal call for supporting Indian traders

  • కాజల్ 'దేశీయత' పిలుపు
  • త్రివిక్రమ్ కి మహేశ్ గ్రీన్ సిగ్నల్ 
  • రీమేక్ లో భాగస్వామిగా సురేశ్ సంస్థ

 *  కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని వ్యాపారులందరూ నష్టపోయారని, వారికి మనం మద్దతుగా నిలవాలని అంటోంది కథానాయిక కాజల్ అగర్వాల్. 'పరిస్థితులు కుదుటపడ్డాక మనం ఇక మన దేశం కోసం పనిచేయాలి. మన ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అవ్వడం కోసం కొన్నాళ్లు విదేశాలకు వెళ్లద్దు. మన ఖర్చులన్నీ ఇక్కడే చేయాలి. మన దేశ బ్రాండులనే కొనాలి. ప్రతి విషయంలోనూ మన దేశ ఉత్పత్తులనే వినిమయం చేయాలి. అలా మన వ్యాపారులకు అండగా వుందాం' అంటూ పిలుపునిచ్చింది కాజల్.  
*  'అతడు', 'ఖలేజ' సినిమాల తర్వాత మళ్లీ మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్లో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 'ఖలేజ' తర్వాత ఇద్దరి మధ్య వృత్తిపరంగా కొన్ని అభిప్రాయభేదాలు వచ్చాయనీ, అందుకనే ఇద్దరూ కలసి మరో సినిమా చేయలేదని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ తో చేయడానికి మహేశ్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.  
*  మలయాళంలో హిట్టయిన 'అయ్యప్పనుం కోశియం' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ హక్కుల్ని తీసుకుంది. అయితే, తాజాగా ఈ ప్రాజక్టులో భాగస్వామిగా సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ కూడా చేరినట్టు తెలుస్తోంది. బాలకృష్ణ, రానా ఇందులో ప్రధాన పాత్రలను పోషించనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

  • Loading...

More Telugu News