Ramky: ఏపీ సీఎం సహాయనిధికి రాంకీ రూ. 5 కోట్ల విరాళం
- సీఎంను కలిసి చెక్కు అందించిన ఎండీ గౌతంరెడ్డి
- రూ. 2 కోట్ల విలువైన పీపీఈ కిట్లు కూడా
- వైరస్‌పై పోరుకు కలిసికట్టుగా పోరాడాలన్న గౌతంరెడ్డి
కరోనా వైరస్‌పై పోరుకు రాంకీ ఎన్విరో ఇంజినీర్స్ లిమిటెడ్ ముందుకొచ్చింది. తన వంతు సాయంగా ఏపీ సీఎం సహాయనిధికి రూ. 5 కోట్ల విరాళం అందజేసింది. ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కలిసిన రాంకీ ఎండీ, సీఈవో ఎం.గౌతంరెడ్డి, ఆళ్ల శరణ్‌లు చెక్కును అందజేశారు. విరాళంతోపాటు రెండు కోట్ల రూపాయల విలువైన పీపీఈ కిట్లను కూడా అందించనున్నట్టు వారు ప్రకటించారు. ఈ సందర్భంగా గౌతంరెడ్డి మాట్లాడుతూ.. కనిపించని శత్రువుతో పోరాడేందుకు అందరూ ఏకం కావాల్సి ఉందన్నారు. వైరస్ నియంత్రణకు ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలని కోరారు.