Narendra Modi: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి ప్రధాని మోదీ రిప్లై.. ఆసక్తికర వ్యాఖ్యలు
- మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్
- ఇటువంటి విపత్కర పరిస్థితులు స్నేహితులను మరింత దగ్గర చేస్తాయి
- భారత్-అమెరికా మధ్య సత్సంబంధాలు ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయి
- భారత్ వీలైన సాయాన్ని చేస్తూనే ఉంటుంది
తమకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ కావాలంటూ ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన విజ్ఞప్తికి భారత్ సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. మొదట వాటి ఎగుమతిపై నిషేధం విధించినా ఆ తర్వాత దాన్ని ఎత్తేసింది. దీనిపై ట్రంప్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ప్రధాని మోదీ పలు వ్యాఖ్యలు చేశారు.
'మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇటువంటి విపత్కర పరిస్థితులు స్నేహితులను మరింత దగ్గర చేస్తాయి. భారత్-అమెరికా మధ్య సత్సంబంధాలు ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయి. కొవిడ్-19పై చేస్తోన్న పోరాటంలో భారత్ వీలైన సాయాన్ని చేస్తూనే ఉంటుంది. మనమంతా కలిసి కరోనాపై గెలుస్తాం' అని ట్వీట్ చేశారు.
కాగా, అమెరికాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇస్తామంటూ భారత్ చేసిన ప్రకటనపై ట్రంప్ స్పందిస్తూ... 'అసాధారణ పరిస్థితుల్లో స్నేహితులు సాయం చేసుకోవడం అవసరం. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌పై మంచి నిర్ణయం తీసుకున్నందుకు భారత్‌కి, భారత ప్రజలకు కృతజ్ఞతలు' అన్నారు. ఇంకా చెబుతూ, కరోనాపై పోరాటంలో కేవలం భారదేశానికే కాకుండా మొత్తం మానవాళికి మీరు చేస్తున్న సాయం విషయంలో మీ బలమైన నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంటూ ట్రంప్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు.