Bollywood: బాలీవుడ్ నటి షెఫాలీ షా ఫేస్​బుక్ హ్యాక్.. ఆమె ఫ్యామిలీకి కరోనా అంటూ ఫేక్ పోస్ట్

Bollywood Actress Face Book Hacked and hackers post Corona To Her Family
  • ఖండించిన సీనియర్ నటి షెఫాలీ షా
  • తన ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ చేశారని వెల్లడి
  • తన కుటుంబం బాగానే ఉందని వివరణ
తన కుటుంబ సభ్యులకు కరోనా సోకిందన్న వార్తలను బాలీవుడ్ సీనియర్ నటి షెఫాలీ షా కొట్టి పారేశారు. ఇవన్నీ పుకార్లే అని చెప్పారు. తన ఫేస్‌బుక్ ఖాతాను హ్యాక్ చేసి కొందరు.. తన ఫ్యామిలీ మెంబర్లకు కరోనా వైరస్ వచ్చిందని పోస్ట్ పెట్టారని తెలిపారు. దీన్ని ప్రజలెవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె వివరణ ఇచ్చారు. తన ఫ్యామిలీలో అందరికీ కరోనా వచ్చిందన్న ఫేస్‌ బుక్‌ పోస్టులో నిజం లేదని చెప్పారు. తన కుటుంబ సభ్యులు, తాను క్షేమంగానే ఉన్నామని తెలిపారు. తన అకౌంట్‌ను హ్యాక్ చేసి, ఫేక్ పోస్టు పెట్టింది ఎవరో ఆ దేవుడికే తెలియాలన్నారు. ఈ పోస్టు చూసి తమ క్షేమ సమచారం కోసం సంప్రదించిన అందరికీ షెఫాలీ ధన్యవాదాలు తెలిపారు.
Bollywood
actress
Facebook
account
hacked
fake post
Corona Virus
her family

More Telugu News