IYR Krishna Rao: కారణాలు ఏమిటో తెలియదు కానీ బ్రాహ్మణ కార్పొరేషన్ అచేతనం అయింది: ఐవైఆర్

IYR Krishna Rao questions AP government on Brahmana Corporation
  • ఏపీ ప్రభుత్వంపై ఐవైఆర్ అసంతృప్తి
  • వెయ్యి కోట్లు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారన్న ఐవైఆర్
  • దానిపై ఎలాంటి చర్యలు లేవని వ్యాఖ్యలు
మాజీ ఐఏఎస్ అధికారి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ అంశంపై స్పందించారు. ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చాక బ్రాహ్మణ కార్పొరేషన్ అచేతనం అయిందని ఆరోపించారు. అందుకు కారణాలు తెలియడంలేదని వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోలో బ్రాహ్మణ కార్పొరేషన్ కు రూ.1000 కోట్లు ఇస్తామని పేర్కొన్నారని, దానిని నిలబెట్టుకునే దిశగా ఎలాంటి చర్యలు కనిపించడంలేదని తెలిపారు. ఈ హామీపై ప్రభుత్వం దృష్టిపెడితే బాగుంటుందని ట్విట్టర్ లో స్పందించారు.
IYR Krishna Rao
Brahmana Corporation
YSRCP
Manifesto
Andhra Pradesh

More Telugu News